హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాద్‌నగర్‌లో ఘనంగా భవానీమాత స్వాగతోత్సవం

RR: షాద్‌నగర్ పట్టణంలోని ఈశ్వర్‌ కాలనీలో భగత్‌సింగ్‌ అసోసియేషన్, కౌన్సిలర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో శ్రీ భవానీమాతకు ఘన స్వాగతం పలికారు. మహిళల మంగళహారతులు, యువకుల నృత్యాలు, డప్పుల దరువులతో కాలనీలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ అగ్గనూరు బసవేశ్వర్‌తో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.