హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటోడ్రైవర్‌ దారుణ హత్య

SRD: జహీరాబాద్ మండలం తూంకుంట శివారులోని అటవీ ప్రాంతంలో ఆటోడ్రైవర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మొగుడంపల్లి మండలం మన్నాపూర్‌కు చెందిన శ్రీనివాస్‌(49) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తుండగానే..అడవిలో పాక్షికంగా దహనం చేసిన మృతదేహాన్ని గుర్తించారు.