హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.8.98 కోట్ల విలువైన బంగారం సీజ్

AP: విశాఖలో రూ.8.98 కోట్ల విలువైన విదేశీ బంగారాన్ని DRI అధికారులు సీజ్ చేశారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టుబడింది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు మీదుగా అక్రమంగా బంగారం రవాణా చేస్తుండగా విశాఖలో అధికారులు కారును అడ్డుకున్నారు. మూడు ప్యాకెట్లలో ఉన్న విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు.