హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు, బైక్ ఢీ.. వ్యక్తికి తీవ్రగాయాలు

MNCL: మందమర్రి మండలం సారంగపల్లి సమీపంలో ఇవాళ కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రమేశ్ అనే వ్యక్తి కాలికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బెల్లంపల్లి 108 సిబ్బంది ఈఎంటీ రాకేశ్, పైలట్ వినయ్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం క్షత్తగాత్రుడిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.