హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో భారీగా బంగారం పట్టివేత

విశాఖ జాతీయ రహదారిపై రూ.8.98 కోట్ల విలువైన విదేశీ బంగారాన్ని డీఆర్ఎ అధికారులు ఇవాళ స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కాతా నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారులో బంగారం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేశారు. కారులో 3 ప్యాకెట్లలో ఉన్న బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.