హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విచారణ జరిపి నోటిఫికేషన్ రద్దు చేయాలి'

ASF: బెజ్జూర్ మండలం మర్తిడి నంబర్-2 అంగన్వాడీ టీచర్ దర్శి తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరారు. ఏడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న తనపై వ్యక్తిగత భూ వివాదం నేపథ్యంలో కేసు నమోదైందన్నారు. సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వకుండానే పోస్టును ఖాళీగా ప్రకటించి నోటిఫికేషన్ జారీ చేయడం అన్యాయమని ఆరోపించారు. విచారణ జరిపి నోటిఫికేషన్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.