బాపట్ల నగరంలో ఈ నెల 12న ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యురాలు రత్నకుమారి తెలిపారు. ఇందులో చర్మ, ఈఎన్‌టీ, దంత, కంటి, ఆర్థోపెడిక్, గైనకాలజీ నిపుణులు ఉచితంగా రోగులకు పరీక్షలు చేస్తారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
12న మెగా వైద్య శిబిరం


