హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి భారీగా చేరికలు

RR: షాద్‌నగర్ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు మహబూబ్ నగర్ వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వారికి కండువా కప్పి ఆహ్వానించారు. మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార ఉద్యమానికి, పాదయాత్రకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు ప్రకటించారు.