సౌదీ అరేబియాలోని రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీల దాడి భారత్ ఖండించింది. ఈ క్షిపణుల దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని పేర్కొంది. సాధారణ పౌరులు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. వెంటనే ఇలాంటి దాడులు ఆపాలని కోరింది. ఈ సందర్భంగా మృతులకు సంతాపం ప్రకటించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
వార్తలు
సౌదీపై హౌతీల దాడిని ఖండించిన భారత్


