హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గద్వాల-అయిజ రోడ్డు పరిస్థితి దారుణం!

GDWL: గద్వాల-అయిజ ప్రధాన రహదారి దారుణంగా తయారైంది. రోడ్డుపై గుంతలు పడి కంకర తేలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, తక్షణమే ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ప్రయాణాన్ని సురక్షితం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.