హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటమి భయంతోనే ఆరోపణలు'

MBNR: కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనలు ఏమాత్రం సమర్థనీయం కాదని కౌకుంట్ల బీజేపీ నాయకుడు సింగారపు కృష్ణారెడ్డి అన్నారు. రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను వివాదాల్లోకి లాగుతోందని విమర్శించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఆ పార్టీ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని ఆయన మండిపడ్డారు.