KKD: తుని మండలం రాజుల కొత్తూరు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. ముందు వెళ్తున్న బొలెరోతో పాటు మరో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజుల కొత్తూరు వద్ద రోడ్డు ప్రమాదం


