హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలా త్రిపుర సుందరి దేవిగా బల్కంపేట ఎల్లమ్మ

HYD: బల్కంపేట ఎల్లమ్మ గుడిలో శరన్నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అధికారులు, వేద పండితులు, అర్చకులు వేకువజాము నుంచి అమ్మవారిని పవిత్ర గంగా జలాలు, పంచామృతాలతో అభిషేకించి వివిధ రకాల పువ్వులతో శోభాయమానంగా అలంకరించారు. బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.