హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు

RR: ఫరూఖ్‌నగర్ మండలం ఎల్లికట్ట శ్రీ అంబా భవానీ మాత క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భవానీ మాత అనుగ్రహంతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.