హైదరాబాద్: 28°C
వార్తలు

రెండో రోజూ దిగ్బంధంలోనే ఢిల్లీ

సీజేపీ ఇంఛార్జ్ అజింక్య పిలుపు మేరకు ఇవాళ కూడా జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతంలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. 30,000 మందికి పైగా పోలీసులు, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. రాజధాని సరిహద్దులు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లలో నిఘాను పెంచారు. పరిస్థితిని అదుపు చేయడంలో ఢిల్లీ పోలీసులకు 120కి పైగా కేంద్ర సాయుధ బలగాలు సహకారం అందిస్తున్నాయి.