హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిడ్ మానేరు నీటిమట్టం వివరాలు

SRCL: బోయినపల్లి మండలం మాన్వాడ వద్దగల మిడ్ మానేరు రిజర్వాయర్ నీటిమట్టం ఇవాళ ఉదయం 6 గంటలకు 316.36 మీటర్లుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318 మీటర్లు కాగా, 27.55 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 23.485 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో నిలిచిపోగా, ఔట్‌ఫ్లో 157 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. స్పిల్‌వే, రివర్ స్లూయిజ్ గేట్లు మూసివేసి ఉన్నాయి.