హైదరాబాద్: 28°C
భక్తి

దసరా ఉత్సవాలు.. అమ్మవారి అలంకరణలు

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ అమ్మవారు బాలా త్రిపురసుందరి దేవిగా దర్శనమిచ్చారు. రేపు గాయత్రీ దేవిగా, ఆ తర్వాత అన్నపూర్ణాదేవి, మహాచండీ, లలితా త్రిపురసుందరి, సరస్వతీదేవి (మూలా నక్షత్రం), మహాలక్ష్మీ, దుర్గాదేవి(దుర్గాష్టమి), మహిషాసురమర్దన, రాజరాజేశ్వరి దేవి(విజయదశమి)గా దర్శనమిస్తారు. ఈనెల 20న కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవం నిర్వహించనున్నారు.