హైదరాబాద్: 28°C
భక్తి

నేటి నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ చేయనున్నారు. రేపటి నుంచి ఈనెల 20వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలకు సప్తగిరులు ముస్తాబయ్యాయి. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈనెల 20 వరకు ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశారు. రేపు రాత్రి 9 గంటలకు పెదశేష వాహనంతో వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.