హైదరాబాద్: 28°C
భక్తి

నవరాత్రిలో ఉపవాసం ఉంటున్నారా..?

రేపటి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులు ఉపవాసం చేసేవారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పూర్తిగా ఖాళీ కడుపుతో ఉండకుండా పండ్లు, పాలు, పెరుగు, సగ్గుబియ్యం, ఉడికించిన చిలగడదుంప తీసుకోవచ్చు. రోజంతా నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగండి. షుగర్, బీపీ ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా కఠిన ఉపవాసం చేయవద్దు. భక్తితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమే.