హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమల సమాచారం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 68,187 మంది భక్తులు దర్శించుకోగా.. 23,923 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారికి రూ.4.55 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.