హైదరాబాద్: 28°C
తెలంగాణ

గడి మైసమ్మ గుడిలో నవరాత్రి ఉత్సవాలు

మేడ్చల్లోని గడి మైసమ్మ తల్లి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపాకటాక్షాలు తమపై ఉండాలని భక్తులు ప్రార్థించారు.