AKP: చోడవరం నుంచి అనకాపల్లి వెళుతున్న ఆర్టీసీ బస్సు వెంకన్నపాలెం వద్ద ఇవాళ ఉదయం ఆగిపోయింది. బస్సులో సాంకేతిక లోపం తలెత్తడంతో చోడవరం నుంచి ఆరు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ఆగిపోయినట్లు ప్రయాణికులు తెలిపారు. దీంతో చోడవరం నుంచి పలు గ్రామాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మరో బస్సు వచ్చేవరకు వేచి ఉండాలని ప్రయాణికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సాంకేతిక లోపంతో ఆగిపోయిన ఆర్టీసీ బస్సు


