హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారి మరమ్మతుల కోసం సీపీఎం రాస్తారోకో

MLG: వెంకటాపురం–చర్ల ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు ఆదివారం బోదాపురం వద్ద రాస్తారోకో నిర్వహించారు. రహదారిపై గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఆర్‌అండ్‌బీ అధికారులు వారం రోజుల్లో మరమ్మతులు చేపడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.