హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్డాన్ సెర్చ్‌లో 45 బైక్‌లు స్వాధీనం

బాపట్ల జిల్లా మార్టూరులోని జనార్దన్ కాలనీలో కార్డాన్ సెర్చ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆపరేషన్‌లో భాగంగా ప్రతి ఇంటిని పోలీసులు క్షుణ్నంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని 45 బైకులు, 8 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కొత్తగా వచ్చిన అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.