PLD: రొంపిచర్ల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలాత్రిపురసుందరీ దేవి (బాల అలంకారం) రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
బాల అలంకారంలో అమ్మవారి దర్శనం


