హైదరాబాద్: 28°C
వార్తలు

విజయవాడ ఉత్సవ్‌పై మోదీ లేఖ

ఏపీలో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ నిర్వహణ సంతోషకరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఉత్సవ్‌ను నిర్వహిస్తున్న ప్రభుత్వం, సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ఏపీ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ కార్యక్రమం పారిశ్రామికవేత్తలకు కొత్త మార్గాలు తెరుస్తుందని.. పర్యాటక రంగానికి కూడా కొత్త ఉత్తేజాన్ని అందిస్తుందని వెల్లడించారు.