హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాహనం బోల్తా.. యువకుడి మృతి

SS: పెనుకొండ మండలం గుట్టూరు శివారులోని 44వ జాతీయ రహదారిపై కియా షోరూం సమీపంలో సరకు రవాణా వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బళ్లారి జిల్లా హాగరి బొమ్మనహళ్లికి చెందిన మహమ్మద్ వలి (23) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.