MHBD: తొర్రూరు మండలం పత్తేపురంలో ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి ఐదు రోజులు గడుస్తున్నా విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 100 ఎకరాలకు పైగా వరి పంటలతో పాటు కూరగాయలు, మిర్చి తోటలు నీరందక ఎండిపోతున్నాయని ఆదివారం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు చేపట్టలని రైతులు కోరారు.
తెలంగాణ
రైతులకు కరెంట్ కష్టాలు.. ఎండుతున్న పంటలు


