హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలతో రైతులకు కష్టాలు

JGL: బుగ్గారం మండలం మద్దునూర్ నుంచి రాయపట్నం వెళ్లే దారిలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ శనివారం చోరీకి గురైంది. నెల రోజుల్లోనే రెండుసార్లు చోరీ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ లేక మోటార్లు పనిచేయక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. వెంటనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి, దొంగలను గుర్తించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.