W.G: పెనుగొండ మండలం వడలికి చెందిన మణికంఠేశ్వరి (28) ఆత్మహత్య చేసుకున్నట్లు కోనసీమ జిల్లా కొత్తపేట ఎస్సై సురేంద్ర తెలిపారు. ఆమెకు 2018లో రామకృష్ణతో వివాహమైంది. వీరికి ఏడేళ్ల కుమారుడు, 3 నెలల చిన్నారి ఉన్నారు. శుక్రవారం ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన మణికంఠేశ్వరి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మనస్తాపంతో ఇద్దరు పిల్లల తల్లి ఆత్మహత్య


