హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో నేటి మాంసం ధరలు ఇవే!

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో చికెన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. గత ఆదివారం కిలో చికెన్ రూ.260 ఉండగా.. ఈ ఆదివారం కూడా అదే ధర కొనసాగుతోంది. మరోవైపు మటన్ ధర కిలో రూ.900గా ఉంది. వారాంతం కావడంతో మాంసం కొనుగోళ్లపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ధరల్లో పెద్దగా మార్పులు లేకపోవడంతో వినియోగదారులకు కొంత ఊరట లభిస్తోంది.