NDL: నందికొట్కూరు శ్రీకృష్ణ గోశాలలో అమావాస్య సందర్భంగా గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సఫారే గోవిందరాజులు ఆధ్వర్యంలో గుజ్జుల గౌరీశ్వర నాయుడు దంపతులు, గోశాల నిర్వాహకులు పాల్గొన్నారు. గోమాతలకు పచ్చగడ్డి అందించి గోసేవ చేశారు. గోమాత సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, గోసేవతో ప్రకృతి, వ్యవసాయానికి మేలు జరుగుతుందని గుజ్జుల గౌరీశ్వర నాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నందికొట్కూరు గోశాలలో అమావాస్య ప్రత్యేక పూజలు


