హైదరాబాద్: 28°C
వార్తలు

'మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ' కాదిది: ఖర్గే

దేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. దేశాన్ని మదర్ ఆఫ్ డెమోక్రసీ నుంచి మజిల్డ్ డెమోక్రసీగా మోదీ ప్రభుత్వం మార్చేస్తుందని విమర్శించారు. యువత, విద్యార్థులు, జర్నలిస్టులు, రైతు సంఘాలు, యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్లు ఇలా ఎవరైతే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారో వారందరినీ నిర్బంధిస్తోందని ధ్వజమెత్తారు.