హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ

SRPT: మునగాల మండల కేంద్రం శివారులోని చిన్న కాల్వ కట్టపై మిషన్ భగీరథ పైపులైన్ లీకై నీరు వృథాగా పోతుంది. గతంలో మరమ్మతులు చేసినా మళ్లీ లీకేజీ కావడంతో పనుల నాణ్యతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని నెలలుగా ఈ సమస్య కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. తక్షణమే శాశ్వత మరమ్మతులు చేపట్టాలని, తాగునీటి వృథాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.