ప్రకాశం: గిద్దలూరు మండలంలోని అక్కలరెడ్డిపల్లి గ్రామంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీని పగలగొట్టి రూ.50,000 నగదును అపహరించారు. అలాగే ఆలయంలో ఐదు తులాల వెండి, కొత్త మైక్ సెట్‌తో పాటు రూ.30,000 విలువైన అన్నదాన సరుకులను దుండగులు ఎత్తుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయంలో చోరీ.. రూ.1.30 లక్షలు మాయం


