ప్రకాశం: పాకాల బీచ్‌లో సముద్ర స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి చెందడం, మరికొందరు గల్లంతవడంపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ట్వీట్ చేశారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాకాల బీచ్ ఘటనపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి


