హైదరాబాద్: 28°C
తెలంగాణ

రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లే దారిలో ఇక్కట్లు

NRML: సారంగాపూర్ చించోలి (బి) శివారులోని జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లే మట్టి దారి గుంతలమయంగా మారి సందర్శకులకు ఇబ్బందులు కలిగిస్తోంది. సమస్య పరిష్కారానికి చేపట్టిన సీసీ రోడ్డు పనులు కేవలం 50 మీటర్లకే, అదీ ఒకవైపునే పరిమితం కావడంతో రాకపోకలకు మరింత ఇబ్బందిగా మారిందని ప్రజలు వాపోతున్నారు. రహదారి పనులు పూర్తిస్థాయిలో చేపట్టాలని కోరుతున్నారు.