KNR: రామడుగు మండలంలోని రుద్రారంలో బహిరంగ మద్యపానంతో స్థానికులు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయానికి వెళ్లే దారిలో ఖాళీ మద్యం సీసాలు కనిపించాయి. మందుబాబులు ఆ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకోవడంతో భక్తులకు అసౌకర్యం కలుగుతోందని గ్రామస్థులు తెలిపారు. అధికారులు స్పందించి బహిరంగ మద్యపానాన్ని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ఆలయ మార్గంలో మద్యం సీసాలు.. భక్తులకు ఇబ్బందులు


