హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఉచిత కంటి పరీక్షలు

నాగర్‌కర్నూల్: రాంనగర్ కాలనీలో ఈ నెల 14వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు బి. శివారెడ్డి తెలిపారు. కంటిపొర సమస్య ఉన్నవారిని మహబూబ్‌నగర్‌లోని లయన్ రాంరెడ్డి ఆసుపత్రికి తరలించి ఉచితంగా ఆపరేషన్లు చేస్తామన్నారు. ఆధార్, ఓటరు లేదా రేషన్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.