హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువకుడిపై పోక్సో కేసు

KKD: సినిమారోడ్డుకు చెందిన 15 ఏళ్ల బాలికను తల్లిదండ్రులు మందలించడంతో ఈ నెల 9న తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన బాలికను సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడు ఫొటోలు బయటపెడతానని బెదిరించినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.