HNK: జిల్లా నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభంపై ఇంకా స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. జిల్లాల పునర్విభజన తర్వాత నక్కలగుట్టలోని ఇరిగేషన్ భవనంలో కలెక్టరేట్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కొత్త భవన నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదు. ఈ దసరాకైనా ప్రారంభిస్తారా అని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ
కొత్త కలెక్టరేట్ ప్రారంభం ఎప్పుడో..?


