హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా: ఎస్పీ

VZM: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ తెలిపారు. గత ఎన్నికల్లో నమోదైన కేసులు, ఘర్షణలు, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.