హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

12న చలో కలెక్టరేట్‌కు నో పర్మిషన్

ప్రకాశం: ఒంగోలులో ఈ నెల 12న ఎమ్మార్మీఎస్, ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే చలో కలెక్టరేట్‌కు అనుమతి లేదని జిల్లా ఎస్పీ వి. హర్షవర్దన్ రాజు పేర్కొన్నారు. సింగరాయకొండలోని చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థి తౌశిక్ మృతి ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చేపట్టే ఈ కార్యక్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉన్నందున అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.