హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా జడ్పీ సీఈవోగా కృష్ణమోహన్

ఏలూరు: జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఎం.కృష్ణమోహన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు వెలువరించింది. ఇప్పటివరకు ఆయన APMSIDCలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వర్తించారు. గత సీఈవో జగదాంబ రిటైర్ కావడంతో డీపీవో మల్లికార్జునరావు అదనపు బాధ్యతలు చూస్తుండగా.. కృష్ణమోహన్ విధుల్లో చేరనున్నారు.