హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌కు 300 మంది కెనడా ప్రతినిధులు

భారత్, కెనడా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 300 మందితో ప్రతినిధుల బృందాన్ని భారత్‌కు కెనడా పంపనున్నట్లు తెలిపింది. ఇంటర్నేషనల్ ట్రేడ్ మినిస్టర్ మణిందర్ సిద్ధు నేతృత్వంలోని ఈ బృందం ఈ నెల 12 నుంచి 16 వరకు ముంబై, బెంగళూరులో పర్యటించనుంది. పలు రంగాల్లో వాణిజ్యంపై డీల్ కుదుర్చుకోనున్నారు.