హైదరాబాద్: 28°C
తెలంగాణ

పగిలిన పైపులు.. పట్టించుకోని అధికారులు

KNR: మానకొండూర్ మండలంలోని ముంజంపల్లి శివారులో మిషన్ భగీరథ పైపులు పగిలిపోవడంతో నీరు వృథాగా పోతోంది. కొన్నిరోజులుగా నీరు రహదారి పక్కన ప్రవహిస్తున్నా అధికారులు మరమ్మతులు చేపట్టడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. తాగునీరు వృథా కాకుండా వెంటనే పైపులకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.