KKD: గొల్లప్రోలు పట్టణంలోని ఈబీసీ కాలనీలో ఆదివారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ జి.వి.వి. సత్యనారాయణ, ఎస్ఐ ఎన్. రామకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి సరైన రికార్డులు లేని 31 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం త్రిషుల్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నివారణ, మహిళల భద్రత, రహదారి నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల కార్డన్ సెర్చ్...31 వాహనాలను స్వాధీనం


