హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదివారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 79,737 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 24,326 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. 3.66 లక్షల లడ్డూలను విక్రయించగా, 1.83 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు. హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.