SKLM: ఆమదాలవలసలోని కొలువైయున్న గ్రామదేవత శ్రీ పాల పోలమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మొదటి రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపురసుందరీ దేవిగా అలంకరించి, భక్తులకు దర్శనం కల్పించారు. తొలుత ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శ్రీ బాలా త్రిపురసుందరీ దేవిగా గ్రామదేవత


