NDL: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున ఆలయంలో ఆదివారం నుంచి 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు. తొలిరోజు యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, శ్రీచక్రార్చన, రుద్రాభిషేకం. అమ్మవారు శైలపుత్రి నుంచి సిద్ధిదాత్రి వరకు రోజుకో అలంకారంలో దర్శనమిస్తారు. 19న ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పిస్తుంది. 20న నంది వాహనసేవ, శమీపూజ, తెప్పోత్సవం ఉంటాయని చైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో నేటి నుంచి దసరా


